న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (ఈరోజు) శనివారం కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా రాష్ట్రాలు నేడు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి నేటికి 25 ఏళ్లు పూర్తియిన సందర్భంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘ప్రకృతి, సంస్కృతికి అంకితమైన ఛత్తీస్‌గఢ్ నేడు ప్రగతికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో నిమగ్నమై ఉంది. ఒకప్పుడు నక్సలిజం బారిన పడిన ఇక్కడి ప్రాంతాలు నేడు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి’ అని పేర్కొన్నారు. 1956లో ఇదేరోజున ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, 1966లో పంజాబ్, హర్యానా, 2000లో ఛత్తీస్‌గఢ్ ఏర్పాటయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
Today, when we mark Kannada Rajyotsava, we celebrate the spirit of excellence and industrious nature that the people of Karnataka are synonymous with. We also celebrate the outstanding culture of Karnataka, reflected in its literature, art, music and more. The state embodies the…
— Narendra Modi (@narendramodi) November 1, 2025
కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రజలను ప్రధాని అభినందించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ ఇదేవిధంగా కేరళ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించే మధ్యప్రదేశ్ ప్రజలకు కూడా ప్రధాని మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘మన రైతు సోదరులు, సోదరీమణుల అవిశ్రాంత కృషి, సైనికుల అసమానమైన పరాక్రమం కారణంగా ఈ చారిత్రాత్మక భూమి.. దేశానికి ఒక ఉదాహరణగా నిలిచిందని’ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఢిల్లీ కాదది.. ఇంద్రప్రస్థ’.. సాక్ష్యాలతో ఎంపీ లేఖ


