మైసూరు: కరోనా కష్ట సమయంలో ఓ అధికారి తన హోదాను పక్కన పెట్టి అంబులెన్స్ డ్రైవర్‌గా మారి మృతదేహాన్ని శ్మశానానికి తరలించి మానవత్వం చాటారు. ఈ ఘటన మైసూరు నగరంలో శనివారం చోటు చేసుకుంది. మైసూరు నగర జనన, మరణ విభాగంలో అనిల్ క్రిస్టి అధికారిగా పనిచేస్తున్నారు. కరోనా కేసులు పెరిగి మృతుల సంఖ్య పెరుగుతుండటంతో వారిని శ్మశానంలో ఖననం చేసేందుకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి కోవిడ్‌తో ఆస్పత్రిలో మృతి చెందగా మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ అందుబాటులో లేకపోయాడు. దీంతో అధికారి అనిల్‌క్రిష్టి తానే అంబులెన్స్‌డ్రైవర్‌గా మారి మృతదేహాన్ని రుద్రభూమికి తరలించి మానవత్వం చాటారు.


