నేడు ‘నెక్స్‌ట్‌’పై వెబినార్‌  | NMC To Conduct Webinar on NeXT Exam Today | Sakshi
Sakshi News home page

నేడు ‘నెక్స్‌ట్‌’పై వెబినార్‌ 

Jun 27 2023 8:02 AM | Updated on Jun 27 2023 8:12 AM

NMC To Conduct Webinar on NeXT Exam Today - Sakshi

సాక్షి, అమరావతి: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్‌ట్‌)పై మంగళవారం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెబినార్‌ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు ఈ వెబినార్‌లో పాల్గొనాలని ఇప్పటికే ఎన్‌ఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఎంబీబీఎస్‌ పాసైనవారు ఉన్నత విద్య, ప్రాక్టీస్, రిజిస్టేషన్‌ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న వేర్వేరు విధానాలన్నింటినీ తొలగించి నెక్స్‌ట్‌ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఎన్‌ఎంసీ భావిస్తోంది.

ఈ క్రమంలో నెక్స్‌ట్‌ గురించి విద్యార్థులు, అధ్యాపకులకు ఈ వెబినార్‌లో ఎన్‌ఎంసీ చైర్మన్‌ సురేశ్‌ చంద్ర శర్మ వివరిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వెబినార్‌ కోసం లెక్చర్‌ హాల్స్‌లో ప్రిన్సిపాల్స్‌ ఏర్పాట్లుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement