ప్రసూతి వార్డులోకి ప్రవేశించిన కుక్క.. శిశువును నోటకరుచుకుని.. | Sakshi
Sakshi News home page

ప్రసూతి వార్డులోకి ప్రవేశించిన కుక్క.. శిశువును నోటకరుచుకుని..

Published Mon, Apr 3 2023 11:24 AM

Newborn Dies After Dog Bites At Karnataka Shivamogga - Sakshi

బెంగళూరు: కొద్ది నెలల క్రితం తెలంగాణలో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే, ఇలాంటి దారుణ ఘటనే తాజాగా కర్నాటకలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఈ ఘటనలో నవజాత శిశువు మృతి చెందింది. 

వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లాలోలని ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులో శనివారం ఉదయం ఓ మహిళ.. శిశువు జన్మించింది. అయితే, శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఓ విధి కుక్క.. ప్రసూతి వార్డులోకి ప్రవేశించింది. అక్కడే ఉన్న శిశువును నోటకరుచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది.. వెంటనే కుక్కను తరిమికొట్టారు. దీంతో, శిశువును అక్కడే వదిలేసి.. కుక్కు బయటకు పరుగులు పెట్టింది. 

అనంతరం, సిబ్బంది శిశువును ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో శిశువును పరిశీలించిన వైద్యులు.. బిడ్డ చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే, కుక్క కాటుకు ముందే నవజాత శిశువు చనిపోయాడా లేదా అంతకుముందే చనిపోయాడా? అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక, శిశువు మృతిలో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement