గోవా: మేయర్‌ కుమార్తె ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

<script>
document.addEventListener("DOMContentLoaded", function() {
 var newsContent = document.querySelector(".news-story-content");
    var paragraphs = Array.from(newsContent.querySelectorAll("p"));
 
  var firstParagraph = paragraphs.find(function(paragraph) {
       return !paragraph.closest('.bullet_list');
   });
  if (firstParagraph.length > 1) {
   var secondParagraph = firstParagraph[1];

 var script = document.createElement("script");
 script.async = true;
 script.id = "AV62ff84d96d945e7161606a7a";
 script.type = "text/javascript";
 script.src = "https://tg1.playstream.media/api/adserver/spt?AV_TAGID=62ff84d96d945e71…";
 
 secondParagraph.parentNode.insertBefore(script, secondParagraph.nextSibling);
}
});
</script>

గోవా: మేయర్‌ కుమార్తె ఆచూకీ లభ్యం

Published Wed, Mar 27 2024 8:05 AM

Nepal Mayors daughter missing in Goa - Sakshi

పనాజీ: గోవాలో అదృశ్యం అయిన నేపాల్‌లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్‌ కుమార్తె ఆర్తీ హామల్‌ ఆచూకీ రెండు రోజుల తర్వాత లభించింది. ఆర్తీ హామల్‌ రెండు రోజుల క్రితం గోవాలో అదృశ్యమైన విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ అదృశ్య ఘటనపై కేసు నమోదు పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులకు ఆమె ఆచూకీ లభించింది. ఆమె నార్త్‌ గోవాలోని మాండ్రేమ్‌లో ఓ హెటల్‌లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో మరో ఇద్దరు మహిళలతో ఆమెను ఉన్న ప్రదేశాన్ని కనుగొన్నామని పోలీసులు తెలిపారు.

ఆర్తీ హామల్‌ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్‌ సెంటర్‌లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్‌ మీడియా పేర్కొంది. 

ఆర్తీ స్నేహితురాలు ఆమె తండ్రికి అదృశ్యం విషయం తెలియజేయగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా తమ కూతురి ఆచూకీ తెలియజేయాలని కోరారు. ‘ఆర్తీ నా  పెద్ద కూతురు. ఆమె ఓషో  ధ్యాన సాధకురాలు. కొన్ని నెలలుగా గోవాలో ఉంటుంది. ఆర్తీ కనిపించటం లేదని ఆమె స్నేహితురాలు సమాచారం అందించటంతో విషయం తెలిసింది. గోవా ఉండేవారు నా కూతురి ఆచూకీ తెలపటంలో సాయం చేయాలని కోరుతున్నా’అని ఆయన ఎక్స్‌ వేదికగా కోరారు.

అదేవిధంగా తన చిన్న కూతురు, అల్లుడు గోవాకు బయల్దేరారని తెలిపారు. తన కూతురును వెతకటంలో సాయం అందించాలని ఆచూకీ తెలియటంతో తమను సమాచారం ఇవ్వాలని ఫోన్‌ నంబర్లను జత చేశారు.

Advertisement
Advertisement