రాజకీయంగా నన్ను టార్గెట్‌ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు | Nitin Gadkari Slams Fake Campaign Against E20 Fuel, Calls It Safe & Eco-Friendly | Sakshi
Sakshi News home page

రాజకీయంగా నన్ను టార్గెట్‌ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Sep 11 2025 1:00 PM | Updated on Sep 11 2025 1:12 PM

Negativity On E20 Petrol Was Paid political campaign Aginst Gadkari

ఇథనాల్‌ కలిపిన ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. 

E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 

ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్‌ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.   

వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్‌ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్‌పై దాఖలైన PILను తిరస్కరించింది.. 

సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే ప్రచారం జరిగింది. అది చెల్లించిన ప్రచారం(పెయిడ్‌ క్యాంపెయిన్‌). అందుకే నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. పెట్రోల్ లాబీ చాలా ధనికం. అది ఎంతో శక్తివంతంగా ఉంది. వాళ్లే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తు ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారాయన.

E20 ఫ్యూయల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇంధనం. ఇథనాల్‌ అనేది.. జొన్న, బియ్యం, పంచదార వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇది పర్యావరణ హితమైంది. దేశీయంగా తయారయ్యే, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనం. అందుకే గడ్కరీ దీనిని ప్రమోట్‌ చేస్తున్నారు. 

E20 ఫ్యూయల్ లక్ష్యం ఏంటంటే.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్ దిగుమతులను తగ్గించడం అలాగే..  రైతులకు ఆదాయం పెంచడం (ఇథనాల్ తయారీ ద్వారా ₹45,000 కోట్ల లాభం వచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు). అయితే.. 

గడ్కరీ ఓ క్లియర్‌ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు.  ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల ఆలోచనతో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ పొందడం.. తద్వారా ఈ తరహా ఆలోచనలతో భారత ఆటో పరిశ్రమను ప్రపంచంలో #1 స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement