భద్రతా బలగాల బేస్‌ క్యాంప్‌పై మావోల మెరుపు దాడి | Maoists Attack On Chhattisgarh Jeedipally Base Camp | Sakshi
Sakshi News home page

భద్రతా బలగాల బేస్‌ క్యాంప్‌పై మావోల మెరుపు దాడి

Dec 8 2024 3:18 PM | Updated on Dec 8 2024 3:47 PM

Maoists Attack On Chhattisgarh Jeedipally Base Camp

రాయ్‌పూర్‌ : తెలంగాణ-ఛత్తీస్‌ ఘడ్‌ సరిహద్దులోని పామేడు ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. పామేడు వద్ద భద్రత బలగాల బేస్‌ క్యాంప్‌పై మావోయిస్ట్‌లు మెరుపు దాడి చేశారు. మావోయిస్ట్‌ల దాడుల్ని భద్రతబలగాలు తిప్పుకొడుతున్నాయి. కాగా, మావోయిస్ట్‌ల చేసిన దాడిలో ఐదుగురు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు గాయపడ్డ జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement