వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ!

Karnataka: Pregnant Lady Delivery Infront Of Govt Hospital - Sakshi

సాక్షి,బళ్లారి(బెంగళూరు): సర్కార్‌ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు అంటూ వైద్యాధికారులు, వైద్యులు నిత్యం చెబుతుండే మాటలు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కళ్లెదుటే ఆస్పత్రులు ఉన్నా రోగులకు వైద్యం అందడం లేదు. ఒక మహిళ  పురిటినొప్పులతో కాన్పు కోసం రాగా ఆస్పత్రిమూసి ఉంది. దీంతో ఆమె ఆస్పత్రి ముందే ప్రసవమైంది.

వైద్యుల నిర్లక్ష్యానికి  ఈఘటన అద్దం పట్టింది. వివరాలు.. విజయపుర జిల్లా నాగఠాణలోని చౌహాన్‌దొడ్డికి చెందిన మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆస్పత్రిని  మూసివేశారు. అప్పటికే నొప్పులు అధికంగా ఉన్న ఆ గర్భిణి ఆస్పత్రి ముందే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరు, నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి   ఫుల్‌ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్‌ సేల్స్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top