జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం | Jharkhand Jamtara Train Accident Latest News Updates In Telugu - Sakshi
Sakshi News home page

Jamtara Train Accident: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు దాటుతున్న పలువురి దుర్మరణం!

Feb 28 2024 8:50 PM | Updated on Feb 29 2024 10:00 AM

Jharkhand Train Accident: Jamtara Train Accident Updates - Sakshi

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న వ్యక్తుల్ని రైలు ఢీ కొట్టడంతో.. 

రాంచీ: జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.  ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా..  మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

బుధవారం సాయంత్రం జంతారా జిల్లా  కళాఝారియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్‌-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.  ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement