జాగ్రత్తలు పాటిస్తే.. ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి

India past COVID-19 peak says Science Ministry panel - Sakshi

గరిష్ట స్థాయి దాటేశామన్న కేంద్ర కమిటీ

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.

మార్చిలో లాక్‌డౌన్‌ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్‌ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని  కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు,  ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్‌లో కోవిడ్‌ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్‌
దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్‌ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ  కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్‌ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్‌లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

చలికాలంలో సెకండ్‌ వేవ్‌ ?
దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్‌ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు  మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్‌ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో  వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్‌లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్‌ విజృంభిస్తుందని పాల్‌ హెచ్చరించారు.

పత్రికల ద్వారా సోకదు
వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్‌ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య  మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్‌ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్‌ చేస్తానన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-12-2020
Dec 03, 2020, 11:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో  భారతీయులు  బ్రిటన్‌ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు....
03-12-2020
Dec 03, 2020, 10:43 IST
ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు.
03-12-2020
Dec 03, 2020, 10:06 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 53,686 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 609 పాజిటివ్‌ కేసులు...
03-12-2020
Dec 03, 2020, 10:05 IST
రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) కన్నుమూశారు.
03-12-2020
Dec 03, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే...
03-12-2020
Dec 03, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర...
03-12-2020
Dec 03, 2020, 01:53 IST
లండన్‌: ఫైజర్‌– బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు...
03-12-2020
Dec 03, 2020, 00:40 IST
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం...
02-12-2020
Dec 02, 2020, 20:42 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు...
02-12-2020
Dec 02, 2020, 15:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు...
02-12-2020
Dec 02, 2020, 13:21 IST
కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
02-12-2020
Dec 02, 2020, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌...
02-12-2020
Dec 02, 2020, 08:09 IST
గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్  కన్నుమూశారు.
02-12-2020
Dec 02, 2020, 05:26 IST
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం...
02-12-2020
Dec 02, 2020, 04:59 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితుల ఇళ్ల వద్ద అధికారులు పోస్టర్లు అంటిస్తుండటంతో ప్రజలు వారిని అంటరానివారిగా చూస్తున్నారనీ, క్షేత్ర స్థాయి పరిస్థితికి...
02-12-2020
Dec 02, 2020, 02:07 IST
సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్, ఆయన కుటుంబసభ్యులు, ఆదేశ సీనియర్‌ అధికారులు, నేతలపై చైనా కోవిడ్‌...
01-12-2020
Dec 01, 2020, 20:11 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక...
01-12-2020
Dec 01, 2020, 15:10 IST
జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది
01-12-2020
Dec 01, 2020, 09:39 IST
సాక్షి, ముంబై : ఇకపై ముంబైకర్లు మాస్కు ధరించకపోతే జరిమానా వసూలు చేసి వారికి ఉచితంగా ఓ మాస్కును అందించనున్నట్లు...
01-12-2020
Dec 01, 2020, 08:34 IST
కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు యావత్‌ ప్రపంచం ఇప్పుడు వ్యాక్సిన్‌ వైపు చూస్తోంది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top