వాహన, వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం బిగ్‌షాక్‌? | Petrol, Diesel, Cooking Gas Prices Likely To Rise Next Week Amid Global Oil Supply Crunch, More Details Inside | Sakshi
Sakshi News home page

వాహన, వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం బిగ్‌షాక్‌?

May 11 2026 5:31 PM | Updated on May 11 2026 5:50 PM

Fuel and Gas Prices Set to Rise Amid Global Oil Crisis

సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్‌, పెట్రోల్‌,డీజిల్‌ వినియోగదారులకు బిగ్‌షాక్‌ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్‌ పెట్రోల్‌కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌-అమెరికా యుద్ధంలో ఆయిల్‌ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్‌,డీజిల్‌ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.

ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్‌,డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్‌ను మూసివేయడంతో భారత్‌కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement