Fire Accident In Coaching Centre At Delhi Mukherjee Nagar - Sakshi
Sakshi News home page

కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. ప్రాణాల కోసం విద్యార్థుల పోరాటం!

Jun 15 2023 4:39 PM | Updated on Jun 15 2023 4:49 PM

Fire Accident In Coaching Centre At Delhi Mukherjee Nagar - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజ‌ధానిలో ఘోర అగ్నిప్ర‌మాద ఘటన చోటుచేసుకుంది. ఓ కోచింగ్‌ సెంటర్‌లో గురువారం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కిటికీల నుంచి తాడు సాయంతో కిందకు దిగారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ముఖ‌ర్జీ న‌గ‌ర్ ప్రాంతంలో ఉన్న భవనం పైఅంతుస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంట‌ర్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో మంట‌లు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు కోచింగ్ సెంట‌ర్ బిల్డింగ్ కిటికీల నుంచి విద్యార్ధులు తాడు సాయంతో కిందికి దూకారు. ఇక,ఈ ప్రమాదం ఘటనలో న‌లుగురు విద్యార్ధులు గాయ‌ప‌డ్డారు. అయితే, అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అ‍గ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

ఘ‌ట‌నా ప్రాంతానికి 11 అగ్నిమాప‌క యంత్రాలు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌స్తున్నాయ‌ని అధికారులు తెలిపారు. కోచింగ్ సెంట‌ర్ నుంచి విద్యార్ధుల‌ను బ‌య‌ట‌కు ర‌ప్పించామ‌ని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్ల‌డించారు. కాగా, అగ్నిప్ర‌మాదానికి కార‌ణాలు తెలియాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత.. 400 కార్ల కాన్వాయ్‌తో భారీ ర్యాలీ.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement