అద్భుత సృష్టి.. ప్లాస్టిక్‌ స్పూన్లతో దుర్గామాత విగ్రహం | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌పై అవగాహన.. సింగిల్‌ యూజ్‌ స్పూన్లతో దుర్గామాత విగ్రహం

Published Sun, Oct 2 2022 7:11 AM

A Durga Idol Made By Entirely Of Single Use Plastic Spoons In Assam - Sakshi

డిస్పూర్‌: ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్‌ బాసక్‌ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్‌ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్‌. 

2015 తొలుత థర్మకోల్‌తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్‌. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్‌. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం 

ఇదీ చదవండి: టైమ్‌ బ్యాడ్‌ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్‌కు ఊహించని షాక్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement