పాస్‌పోర్టుకు డబ్బులు లేక.. | dk shivakumar pawned gold chain for passport now cm race | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టుకు డబ్బులు లేక..

Jun 1 2026 8:07 AM | Updated on Jun 1 2026 8:10 PM

dk shivakumar pawned gold chain for passport now cm race

బెంగళూరు: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరుబడిన డీకే శివకుమార్‌ సాధారణ స్థాయి నుంచి నేడు కాబోయే సీఎంగా మారారు. ఇప్పుడు ఆయన వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి కావచ్చు. అయితే ఒకప్పుడు పాస్‌పోర్టు కోసం బంగారు గొలుసు కుదువ పెట్టారు. వివరాల్లోకెళ్తే.. 1989లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ బెంగళూరుకు వచ్చినప్పుడు భారీ సభ జరిగింది. బెంగళూరు గ్రామీణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా ఉన్న డీకే శివకుమార్‌ పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. 

ఎయిర్‌పోర్టులో డీకేని రాజీవ్‌గాంధీ చూసి ఆరా తీశారు. ఆ తరువాత కొన్ని రోజులకే డీకేకు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. పాస్‌పోర్టుకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పీఎంఓ ఆదేశించినట్లు తెలిపారు. అప్పుడు పాస్‌ పోర్టు కోసం డీకే వద్ద రూ.3 వేలు లేకపోవడంతో మెడలోని బంగారు గొలుసును తాకట్టు పెట్టి అవసరం తీర్చుకున్నాడు. విదేశాల్లో జరిగే యువజన ఉత్సవాలకు డీకేను రాజీవ్‌గాంధీ పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement