దేశమంతటా శ్రావణ సోమవారం సందడి.. కాశీ, హరిద్వార్‌, ఉజ్జయినిలో.. | Devotees Flock Temples Across India | Sakshi
Sakshi News home page

దేశమంతటా శ్రావణ సోమవారం సందడి.. కాశీ, హరిద్వార్‌, ఉజ్జయినిలో..

Jul 28 2025 10:50 AM | Updated on Jul 28 2025 10:57 AM

Devotees Flock Temples Across India

న్యూఢిల్లీ: హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే శ్రావణ సోమవారం నేడు. దీంతో దేశమంతటా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు మహాశివునికి మనసారా అభిషేకాలు చేస్తున్నారు.
 

వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలో మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మంగళ హారతిలో పాల్గొనేందుకు  పొడవైన క్యూలలో నిలుచున్నారు. అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులపై పుష్పవర్షం కురిపించి, పండుగ వాతావరణాన్ని రెండింతలు చేశారు.

అహ్మదాబాద్‌లోని కోటేశ్వర్ మహాదేవ్ ఆలయంలో గుజరాత్‌ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు జరుగుతున్నాయి.  ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా ఉంది.

ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చాందిని చౌక్ నడిబొడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక ఆలయంలోని పరమేశ్వరుణ్ణి చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు దీపాలు వెలిగిస్తూ, తమ భక్తిని చాటుకుంటున్నారు.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మధ్యప్రదేశ్‌లోని ఈ ఆలయంలో నిర్వహించే మంగళ హారతి, దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

రాజస్థాన్‌లోని తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం ఈ ప్రాంతంలోని ముఖ్యమైన తీర్థయాత్రా స్థలంగా పేరొందింది. వేలాది మంది శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయానికి తరలి వస్తున్నారు.

హరిద్వార్‌లోని దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం భక్తులతో కిటలాడుతోంది. గంగానది ఒడ్డున ఉన్న ఈ  ఆలయం భక్తులకు కొంగుబంగారంగా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement