ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు.. 30 రైళ్లు ఆలస్యం

Delhi As Thick Fog Engulfs Capital - Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన  కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. 

ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున  అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు.

CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ

whatsapp channel

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top