ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘గాలాడటం’ లేదు

Published Mon, Oct 23 2023 6:30 AM

Delhi air quality turns very poor - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత ఈ సీజన్‌లో మొదటిసారిగా ఆదివారం ‘వెరీ పూర్‌’ స్థాయికి పడిపోయింది. శనివారం 248గా ఉన్న సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 24 గంటల వ్యవధిలో 313కు పడిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణ మని అధికారులు చెబుతున్నారు. దాంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ సోమవారం సంబంధిత శాఖలతో సమీక్ష జరపనున్నారు.

ప్రైవేటు వాహనాల రాకపోకలను వీలైనంతగా తగ్గించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా పార్కింగ్‌ ఫీజులు పెంచడం వంటి చర్యలు చేపట్టింది. హోటళ్లలో తందూరీ పొయ్యిలపై నిషేధం విధించింది. సీఎన్‌జీ, ఎలక్రి్టక్‌ బస్సుల వినియోగాన్ని, మెట్రో రైలు సరీ్వసుల సంఖ్యను పెంచాలని కోరింది. ఢిల్లీకి 300 కిలోమీటర్ల పరిధిలోపలున్న కాలుష్య కారఖ పారిశ్రామిక యూనిట్లు, ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న, కూలి్చవేత ప్రాజెక్టులు చేపట్టిన చోట్ల దుమ్ము రేగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement