చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు

Cow that saved the farmers life after fighting with the leopard - Sakshi

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఘటన

బనశంకరి: తన యజమానిపై దాడి చేసిన చిరుత పులితో తీవ్రంగా పోరాడి రైతు ప్రాణాలు ఆవు కాపాడిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నగిరి తాలూకా ఉబ్రాణి హొబళి కొడతికెరె గ్రామానికి చెందిన రైతు కరిహాలప్ప(58) గత సోమవారం తన ఆవును తోటలో వదిలిపెట్టి వ్యవసాయ పనుల్లో  నిమగ్నమయ్యాడు.

అక్కడే మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా కరిహాలప్పపై దాడి చేసింది. గమనించిన ఆవు పరుగెత్తుకొచ్చి చిరుతపైకి దూకింది. కొమ్ములతో పొడిచింది. దీంతో చిరుత కిందపడిపోగా, అక్కడే ఉన్న శునకం కూడా దానిపైకి దూకింది. దీంతో చిరుత అక్కడి నుంచి ఉడాయించింది. ఈ సందర్భంగా రైతు కరిహాలప్ప మాట్లాడుతూ తాను పోషించిన ఆవు గౌరీ, శునకం మాత్ర శౌర్యాన్ని ప్రదర్శించి చిరుత బారి నుంచి తన ప్రాణాలు కాపాడాయని చెప్పాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top