రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం | 40 Passengers On The Chennai-Pune Bharat Gaurav Train Suffered From Food Poisoning - Sakshi
Sakshi News home page

Bharat Gaurav Train: రైలులో కలుషిత ఆహారం.. 40 మందికి అనారోగ్యం

Published Wed, Nov 29 2023 12:09 PM

Chennai Pune Bharat Gaurav Train Passenger Health Get Worse - Sakshi

మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో  కలకలం చెలరేగింది. చెన్నై నుంచి పుణెకు వస్తున్న భారత్ గౌరవ్ రైలులో 40 మంది ప్రయాణికుల ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. రైలు పూణె చేరుకోగానే ప్రయాణికులకు వైద్య చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

రైలు పూణే చేరుకోగానే 80 మంది ప్రయాణికుల అనారోగ్యానికి గురైనట్లు తమకు ఫిర్యాదు అందిందని పూణే రైల్వే అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఆ తర్వాత వారికి రైల్వేస్టేషన్‌లోనే ప్రథమ చికిత్స అందించి, ఆ తరువాత బాధితులను ససూన్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రైలులో ఉన్న కొందరు యువకులు రైలులోనివారికి కలుషిత ఆహారం ఇచ్చారు. రైల్వేశాఖ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.
ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
 

Advertisement
 
Advertisement
 
Advertisement