జమ్మూకశ్మీర్‌లో ప్రయోగాత్మకంగా 4జీ

Central Government Is Taking Steps To Restore Internet Services In Jammu Kashmir - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవల పూర్తిస్థాయి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని, ఇందులో భాగంగా ఆగస్టు 15 తరువాత ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల 4జీ ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని బెంచ్‌ ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ జమ్మూకశ్మీర్‌లోని ఒక్కో జిల్లాలో ప్రయోగా త్మకంగా 4జీ ఇంటర్నెట్‌ సర్వీసులు అందించి, రెండు నెలల తరువాత సమీక్షించాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఆ తరువాత దశలవారీగా  విస్తరిస్తామని ఆయన తెలిపారు. జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయిలతో కూడిన బెంచ్‌ స్పందిస్తూ.. కేంద్రం నిర్ణయం సమంజసంగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top