జనవరి 31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఎప్పటి వరకంటే!

Budget Session 2023 Commence on Jan 31 To April 6 Says Pralhad Joshi - Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న  పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు. 

రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 6తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. 66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగున్నట్లు తెలిపారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్‌ చేశారు. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.
చదవండి: ఢిల్లీ సర్కార్‌ వర్సెస్‌ కేంద్రం.. నియంత్రణ కేంద్రానిదే అయితే రాష్ట్ర సర్కార్‌ దేనికి?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top