అయోధ్యలో భూటాన్‌ ప్రధాని | Bhutan PM Dasho Tshering Tobgay Visits Ayodhya Ram Mandir, Receives Special Welcome | Sakshi
Sakshi News home page

అయోధ్యలో భూటాన్‌ ప్రధాని

Sep 6 2025 8:52 AM | Updated on Sep 6 2025 11:36 AM

Bhutan PM Tshering Tobgay, Aum Tashi Doma Arrive in Ayodhya

అయోధ్య: భూటాన్‌ ప్రధానమంత్రి దషో త్సెరింగ్‌ టాబ్గే శుక్రవారం అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఉదయం 9.30 గంటలకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో అయోధ్యకు చేరుకున్న త్సెరింగ్‌కు ఉత్తరప్రదేశ్‌ మంత్రి సూర్యప్రతాప్‌ షాహీ, ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన లక్నో–గోరఖ్‌పూర్‌ మార్గంలో ప్రత్యేక కాన్వాయ్‌లో అయోధ్య ఆలయానికి చేరుకున్నాయి. అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. రామ్‌లల్లా ఆలయంతోపాటు అయోధ్యలోని హనుమాన్‌ గార్షీని త్సెరింగ్‌ దర్శించుకున్నారు. 

ఆయన గౌరవార్థం అధికారులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయోధ్యలో పర్యటన ముగిసిన తర్వాత త్సెరింగ్‌ మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. భూటాన్‌ ప్రధానమంత్రి పర్యటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రత్యేకంగా పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. భారత్, భూటాన్‌ మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నాయని ఉత్తరప్రదేశ్‌ మంత్రి సూర్యప్రతాప్‌ షాహీ పేర్కొన్నారు. భూటాన్‌ ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement