అట్టారీ-వాఘా సరిహద్దుల్లో అట్టహాసంగా బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు

Beating Retreat Ceremony At The Attari Wagah Border Amritsar - Sakshi

న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ఆకట్టుకుంది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో పాక్‌ రేంజర్లు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. 1959 నుంచి ప్రతి ఏటా ఇరు దేశాల సైనికులు ఈ బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా పలు నృత్య ప్రదర్శనలు, గీతాలపనలు నిర్వహించారు.

ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top