పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు! | CRPF sacks jawan for concealing his marriage with Pak woman | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

May 3 2025 8:00 PM | Updated on May 3 2025 8:23 PM

CRPF sacks jawan for concealing his marriage with Pak woman

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని,  ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.

ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది.  సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు  సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

పాక్‌ పంజాబ్‌కు చెందిన మినాల్‌ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్‌లైన్‌లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో  ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేం‍ద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

పూర్తి కథనం కోసం  కింద ఆర్టికల్‌ను క్లిక్‌ చేయండి

భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా

Advertisement
 
Advertisement
Advertisement