నిప్పు కణిక.. నెల్లూరు పొణకా కనకమ్మ గురించి ఈ విషయాలు తెలుసా?

Azadi Ka Amrit Mahotsav Nellore Ponaka Kanakamma History - Sakshi

మహోజ్వల భారతి: వ్యక్తులు, ఘటనలు

పొణకా కనకమ్మ  సుప్రసిద్ద సామాజిక కార్యకర్త. నెల్లూరు పట్టణంలోని కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రం కనకమ్మ స్థాపించినదే. కనకమ్మ 1892 జూన్‌ 10 న జన్మించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మహిళల్లో కనకమ్మ ఒకరు. తనే కాదు, తన కుటుంబం మొత్తాన్నీ ఆమె సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా ప్రేరణ కలిగించారు. ఖద్దరు ధరించమని ప్రచారం చేశారు. రాజకీయరంగంలో కనకమ్మకు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ సహకారం లభించింది.

సాహిత్య రంగంలో కూడా ఎంతో కృషి చేశారు. 1930 సత్యాగ్రహ ఉద్యమకాలంలో జైలుకు వెళ్లారు. కొంతకాలం జమీన్‌ రైతు పత్రిక నడిపారు. 1963  సెప్టెంబర్‌ 15న మరణించారు. కనకమ్మ రాసిన ఒక పద్యంలో పంక్తులు ఈ విధంగా సాగుతాయి : ఊయలలూగించే కోమల కరాలే రాజ్యాలు శాసిస్తవి / తూలికపట్టే మృదుహస్తాలే శతఘ్నులు విదలిస్తవి / జోలలుబుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి. దీనిని బట్టి పొణకా కనకమ్మలో స్త్రీవాద కోణం కూడా గోచరిస్తుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top