మలబార్‌ మేధావులు: కరుణాకరన్‌ కె. కరుణాకరన్‌ టి

Azadi Ka Amrit Mahotsav: Kannoth Karunakaran And Thirunalloor Karunakaran - Sakshi

మహోజ్వల భారతి: వ్యక్తులు, ఘటనలు

కన్నోత్‌ కరుణాకరన్‌ రాజనీతిజ్ఞులు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐ.ఎన్‌.సి.) సభ్యులు. కేరళ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పని చేశారు. అక్కడి  యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ కరుణాకరన్‌ చొరవ ఫలితం గానే ఏర్పడింది. ఆయన ఇందిరాగాంధీకీ, రాజీవ్‌ గాంధీకి సన్నిహితులు. నేడు కరుణాకరన్‌ జయంతి. 1918 జూలై 5న మద్రాస్‌ ప్రెసిడెన్సీ పరిధిలోని చిరక్కల్‌లో జన్మించారు. తెక్కెడతు రవున్ని మరార్, కన్నోత్‌ కల్యాణి అమ్మ ఆయన తల్లిదండ్రులు. కరుణాకర్‌కి ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు, ఒక సోదరి. తండ్రి మలబార్‌ జిల్లాలో రికార్డు కీపర్‌గా పని చేసేవారు. కరుణాకరన్‌ తన 92 వ యేట కేరళలోని తిరువనంతపురంలో 2010 డిసెంబర్‌ 23న  మరణించారు. 

తిరునల్లూరు కరుణాకరన్‌ కవి, ఉపాధ్యాయులు. కొల్లంలోని పెరినాడ్‌లో 1924 అక్టోబర్‌ 8న జన్మించారు. తండ్రి పి.కె.పద్మనాభన్, తల్లి ఎన్‌.లక్ష్మి. కాలేజ్‌లో ఉండగా కార్మిక వర్గ ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ కవితలు, నినాదాలు రాశారు. కవిగా పేర్గాంచారు. తొలి పుస్తకం ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ రాసిన దీర్ఘకవితకు మలయాళ అనువాదం. మలయాళ కవితాయుగంగా ప్రసిద్ధి చెందిన ‘పింక్‌ డికేడ్‌’లో ఆయన భాగస్వామ్యం కీలకమైనది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.సుగంధన్, ఎం.ఎన్‌.గోవిందన్‌ నాయర్‌ల స్ఫూర్తితో సీపీఐ సానుభూతిపరుడిగా మారారు. నేడు కరుణాకరన్‌ వర్ధంతి. 2006 జూలై 5న తన 81వ యేట ఆయన కన్నుమూశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top