ఇలాంటి గిఫ్ట్‌ పొందాలంటే అదృష్టం ఉండాలేమో! వైరల్‌ వీడియో | Assam Man attends wedding leaves Rs 10 for bride melts hearts on internet | Sakshi
Sakshi News home page

ఇలాంటి గిఫ్ట్‌ పొందాలంటే అదృష్టం ఉండాలేమో! వైరల్‌ వీడియో

May 29 2026 12:58 PM | Updated on May 29 2026 2:50 PM

Assam Man attends wedding leaves Rs 10 for bride melts hearts on internet

ఆధునిక పెళ్లిళ్లలో  భారీ ఆర్భాటాలు, ధగధగలాడే నగలు, బరువైన పట్టుచీరలు,  భారీ విందులే కాదు గిఫ్ట్‌, రిటన్‌ గిఫ్ట్‌లు చాలా ముఖ్యం.  ఆత్మీయతలు, అనురాగాలు, పలకరింపులుకంటే.. వచ్చామా.. తిన్నామా.. ఫోటో తీయించుకున్నామా. అన్నట్టే ఉంటాయి సాధారణంగా. కానీ అస్సాంలో  ఒక పెళ్లిలో  చోటు చేసుకున్న ఘటన నెట్టింట అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది.

అస్సాంలో ఒక మానసిక వికలాంగుడు ఆహ్వానం లేకుండా ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. అతను నిశ్శబ్దంగా అతిథులతో కలిసి భోజనం చేశాడు,ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు కూడా.  అబ్బా.. పెళ్లి వారు ఎంత దయ గలవారు అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి. ఇక్కడే మిమ్మల్ని ఆశ్చర్యపర్చే విషయం ఒకటి ఉంది.
పెళ్లివారి కంటే తానే  గొప్పవాడిని అని నిరూపించుకున్నాడు. ఎలా అంటారా? 

ఇదీ చదవండి: ఒక్కసారిగా పేలిన ఏసీ : మాజీ ఐఏఎస్ అధికారి దుర్మరణం

తన కడుపునిండింది కదా, ఆకలి తీరింది కదా అని  కామ్‌ గా అక్కడినుంచి వెళ్లిపోలేదు అతగాడు. వెళ్లే ముందు తన చిరిగిన జేబులోంచి రూ.10 లు తీసి  వదువుకి   కానుకగా అక్కడున్న వారికి అందించాడు. ఈ దృశ్యం చాలా హృద్యంగా నిలిచింది. ఈ హార్ట్‌ టచింగ్‌ వీడియో ఆన్‌లైన్‌లో వేలాది మందిని కదిలించింది. దయ,మానవత్వంతో కూడిన మనిషి అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఎంత ఇచ్చామన్నది కాదు.. ఎంత ప్రేమగా మనస్ఫూర్తిగా ఇచ్చారనేదే ముఖ్యం అంటున్నారు. బహుశా తన జేబులో  10 రూపాయలే ఉండి ఉంటాయ్‌ అని మరికొందరు కామెంట్‌చేశారు.

 ఇదీ చదవండి: ఈ వెహికల్‌ తెచ్చిన లక్‌ : నెలకు రూ. 45 వేలు

Advertisement
 
Advertisement
Advertisement