కరోనా నుంచి కోలుకున్న అమిత్‌ షా | Amit Shah Tests Negative For Coronavirus | Sakshi
Sakshi News home page

అమిత్‌ షాకు కరోనా నెగెటివ్‌

Aug 9 2020 12:55 PM | Updated on Aug 9 2020 3:56 PM

Amit Shah Tests Negative For Coronavirus - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ తెలియజేశారు. కరోనా చికిత్స పొందుతున్న అమిత్‌షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌  వచ్చిందని మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేశారు. కాగా, ఆగస్టు 2న జరిపిన కరోనా పరీక్షల్లో అమిత్‌షాకు పాజిటివ్‌ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సలహా మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. వారం రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. ఇక అమిత్‌షాను కలిసిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కేంద్ర మంత్రులు ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్, కైలాష్ చౌద‌రి, అర్జున్ రామ్ మేఘవాల్‌ కూడా క‌రోనా బారిన  పడ్డారు. (చదవండి : మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement