దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్‌ షా | Sakshi
Sakshi News home page

దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్‌ షా

Published Mon, Feb 12 2024 5:48 AM

Amit Shah: PM Modi worked to secure respect for India heritage on world stage - Sakshi

మైసూరు: ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై దేశ సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేశారు.

దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంతోపాటు యోగ, ఆయుర్వేద, భారతీయ భాషల పరిరక్షణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఆదివారం ఆయన మైసూరు సమీపంలోని సుత్తూరు జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మైసూరులోని చాముండి హిల్స్‌పై కొలువుదీరిన చాముండేశ్వరీ మాతను దర్శించుకుని పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement