ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి!

Alert! Remove these 8 apps from your phone immediately - Sakshi

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. వీరు తమ ఒక్కరూ తమ అవసరాల కోసం కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారు. గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసే యాప్స్‌లో ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయో, యూజర్లకు హాని చేసేవి కూడా అన్నే ఉన్నాయి. వాటినే మాల్‌వేర్, యాడ్‌వేర్ యాప్స్ అంటారు. ఇలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ తొలగిస్తుంది. అలాగే, ప్రైవేట్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు కూడా మాల్‌వేర్ యాప్స్ లిస్ట్ రిలీజ్ చేస్తుంటాయి. వాటిని కూడా గూగుల్ తొలగిస్తూ ఉంటుంది. 

తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ మాల్‌వేర్ ఉన్న 8 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించి వాటి జాబితాను విడుదల చేసింది. ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్‌సులా ప్రాంతాలకు చెందిన యూజర్స్‌ని ఎక్కువగా ఈ యాప్స్ టార్గెట్ చేసినట్టు తెలిపింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ యాప్ లను 7,00,00 కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఫోటో ఎడిటర్స్, వాల్‌పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్, కెమెరా యాప్స్ పేరుతో ఇవి యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. మొదట గూగుల్ పరిశోదన సమయంలో వీరు మొదట క్లీన్ వర్షన్‌ని గూగుల్ ప్లే స్టోర్‌కు సమర్పించి, ఆ తర్వాత అప్‌డేట్స్ రూపంలో మాల్‌వేర్ ప్రవేశపెట్టినట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ను వెంటనే డిలీట్ చేసుకోవాలని మెకాఫీ సూచిస్తుంది.

మాల్‌వేర్ యాప్స్:

  • com.studio.keypaper2021
  • com.pip.editor.digital camera
  • org.my.favorites.up.keypaper
  • com.tremendous.coloration.hairdryer
  • com.ce1ab3.app.picture.editor
  • com.hit.digital camera.pip
  • com.daynight.keyboard.wallpaper
  • Com.tremendous.star.ringtones

చదవండి:  

Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top