నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం | AIIMS Doctor Says Manmohan Singh Health Condition Is Stable | Sakshi
Sakshi News home page

నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్యం

Oct 14 2021 10:45 AM | Updated on Oct 14 2021 10:46 AM

AIIMS Doctor Says Manmohan Singh Health Condition Is Stable - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్య  పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బుధవారం ఆయన అస్వస్థతకు గురవటంతో ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.


కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్మోహన్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement