అన్నా హజారేకు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

Activist Anna Hazare Hospitalised In Pune After Chest Pain - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. 84 ఏళ్ల అన్నా హజారేకు ఛాతిలో నొప్పి రావడంతో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ హాల్ క్లినిక్ మెడికల్ సూపరింటెండెంట్ అవధూత్ భోధమ్వాడ్ తెలిపారు.

అన్నా హజారేకు యాంజియోగ్రఫీ పరీక్షలు చేయగా గుండెలోని కరోనరీ ఆర్టెరీలో చిన్న బ్లాకేజీ ఉన్నట్లు తేలిందని, దీంతో వైద్య బృందం ఆ బ్లాకేజీని తొలగించినట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకావం ఉందన్నారు. కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆసుపత్రికి కాల్‌ చేసి అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
చదవండి: కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు, డిసెంబర్‌ 6న హాజరవ్వాల్సిందే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top