రెమిడెసివిర్‌ కొరత: కేంద్రం కీలక నిర్ణయం 

Nndia to import lakhs vials of Remdesivir to plug shortage; 75k arriving today - Sakshi

వివిధ దేశాలనుంచి దిగుమతి 

నాలుగున్నర లక్షల రెమిడెసివిర్‌ వయల్స్  దిగుమతి

తొలివిడతగా 75వేల రెమిడెసివిర్ వయల్స్‌  దేశానికి రానున్నాయి

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ, కరోనా చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌కు ఏర్పడిన తీవ్ర కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి రెమిడెసివిర్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 4,50,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్‌ను శుక్రవారం రిసీవ్‌ చేసుకోనుంది.  దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులతో రెమిడెసివర్‌ దిగుమతులపై దృష్టిపెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధం ఎగుమతిని కేంద్రం నిషేధించింది

భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, యు ఈజిప్టు ఫార్మా మేజర్ ఇవా ఫార్మా  సంస్థలనుంచి  వీటిని కొనుగోలు  చేయనుంది.  రాబోయే ఒకటి రెండు రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్‌కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ తాజాగా ప్రకటించింది. వెల్లడించింది. అలాగే ఎవా ఫార్మా తొలుత పది వేల వయల్స్ దేశానికి అందించనుంది. జూలై వరకు ప్రతీ15 రోజులకొకసారి 50వేల వయల్స్‌ను వరకు మనదేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ  ఔషద్‌ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది.  ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి. కాగా గత ఏడు రోజులలో (21-28 ఏప్రిల్) దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వయిల్స్‌ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివర్‌ సరఫరా ఏప్రిల్ 11 న 67,900 డి ఏప్రిల్ 28 న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం  గత 24 గంటల్లో 3,86,452 కొత్త కోవిడ్‌-19 కేసులు, 3,498 మరణాలు సంభవించాయి. 2,97,540  రోగులు డిశ్చార్జ్‌ అయ్యారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top