Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్‌ఫోన్‌.. స్పందించిన కంపెనీ

8 Year Old Last Breath Watching Video On Smartphone Kerala Company Reacts - Sakshi

మొబైల్‌లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్‌లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్‌ఫోన్‌లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్‌ ఫోన్‌ మోడల్‌ రెడ్‌ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు.
(చదవండి: చేతిలో స్మార్ట్‌ఫోన్‌..వెన్నెముక డౌన్‌!)

ఫోన్‌ పేలిన ఘటనపై రెడ్‌ మీ మొబైల్స్‌ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్‌ మీ మొబైల్‌ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు.
(స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు)

కాగా, మొబైల్‌ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్‌కు చార్జింగ్‌ పెడుతుండగా షాక్‌ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్‌ అవుతున్న మొబైల్‌లో మాట్లాతుండగా షాక్‌ కొట్టింది. ఆయన స్పాట్‌లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్‌ చార్జింగ్‌లో ఉండగా వాడటం.

నిపుణుల సూచనలివే..!
మొబైల్‌ చార్జింగ్‌ అవుతుండగా వాడరాదు
చార్జ్‌ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్‌ వేడెక్కుతుంది
ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది
ఫోన్‌ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది
బ్యాటరీ లైఫ్‌టైం తగ్గిపోయే అవకాశం ఉంది
పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది
చార్జింగ్‌ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు
తడి చేతులతో చార్జింగ్‌ పెట్టరాదు.. ఫోన్‌ వాడరాదు
నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్‌ పెడితే షాక్‌ కొట్టే చాన్స్‌ ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top