బరువు తగ్గాలి..తగ్గాలి..అని ఊరికే జపం చేసినంత మాత్రాన సరిపోదు. దానికి నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి. ఒక్కోసారి ఈ ప్రయత్నాన్ని సుదీర్ఘం కాలం చేయాల్సి ఉంటుంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. నాలుగు రోజు చేసి, సరైన ఫలితం రాలేదు అని నిరాశ పడి ఆ ప్రయత్నాన్ని వదిలేస్తే మరింత నిరాశ, ఒత్తిడి తప్పదు. ఇదే విషయాన్ని ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ ఆచరించి చూపించారు. పక్కా ప్లాన్‌తో క్రమశిక్షణతో, ఓపిగ్గా ప్రయత్నించి 30 కిలోల బరువు తగ్గారు. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే చాలా మంది విఫలం కావడానికి కారణం క్రమశిక్షణ లేకపోవడం కాదు; మొదలుపెట్టడమే చాలా కఠినంగా, అతి వేగంగా మొదలుపెట్టి, శరీరం మారే లోపే అలసిపోయి ఆపేయడమే అంటారు అంచని సచన్. అంతేకాదు క్రమశిక్షణ లేకపోవడం వల్ల విఫలం కారు ప్లాన్ లేకుండా తొందర పాటుతో ఫశ్రీయిల్ అవతారు అంటారామె. చాలా కఠినంగా, వేగంగా ప్రారంభించడం వల్ల, వారి శరీరంలో మార్పు రావడానికి అవకాశం కూడా రాకముందే అలసిపోతారని వివరించారు.
ఫ్యాట్ లాస్ కోచ్ అంజలి సచన్ స్వయంగా 30 కిలోల అధికబరువును తగ్గించుకుంది. ఇందుకోసం ఆమె అందరిలా కఠినమైనది కాదు. ఎలాంటి నరకం చూపించే పరుగు పందాలు, గంటల కొద్దీ జిమ్ వర్కవుట్లు ఇందులో లేవు.
ఆమె 84 కేజీల నుండి 54 కేజీల దాకా, అంటే 30 కిలోగ్రాములు తగ్గింది. అంజలిబరువును ఆ స్థాయికి చేర్చిన దినచర్య సాధారణమైనది కాదు. మీరి ముఖ్యంగా వెయట్ లాస్ జర్నీలో కఠినమైన స్ప్రింట్లు లేవు. రెండు గంటల జిమ్ సెషన్‌లు లేవు.ఒకే ఒక సూత్రాన్ని నమ్ముకుంది. ప్రస్తుతం ఉన్న స్థితిని గౌరవిస్తూనే, పక్కా ప్లాన్, క్రమబద్ధమైన కార్డియోతో ఫలితం సాధించింది. ఇందుకోసం తాను పాటించిన ప్లాన్‌తో తన అభిమానులతో పంచుకున్నారు.
చాలా చిన్నగా ప్రారంభించండి: అంజలి మొదటి దశలో రోజుకు కేవలం 4,000 అడుగులతో ప్రారంభించాలని చెబుతారు. ప్రతిరోజూ "కనీసం 10,000 అడుగులు నడవాలి" అనే మాటలు వినేవారికి ఇది చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ ఆమె లాజిక్ ఏంటంటే—శరీరంపై ఎక్కువ బరువు ఉన్నప్పుడు, మీ కీళ్లు , నరాలు ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాయి. కాబట్టి మొదట్లోనే ఎక్కువ భారం వేయకూడదు. క్రమంగా ఈ అడుగుల సంఖ్యను పెంచుకుంటూ పోవాలని ఆమె చెబుతారు.
వేగం పెంచే ముందు బలాన్ని పెంచుకోండి
ఫేజ్ 2 (రెండవ దశ): రోజుకు 8,000 అడుగులు + వారానికి ఒక 'జోన్ 2 కార్డియో' సెషన్ ( ఆయాసపడకుండా, హాయిగా మాట్లాడుతూ).
ఫేజ్ 3: 10,000–12,000 అడుగులు + వారానికి రెండు జోన్ 2 సెషన్లు.
ఫేజ్ 4: 15,000 అడుగులు.
ఫేజ్ 5 : 20,000 అడుగులు + వారానికి రెండు నుండి మూడు సెషన్లు.
ఈ పద్ధతి ఎందుకు పనిచేస్తుందంటే, ఒక దశ పూర్తయ్యాకే తర్వాతి దశకు వెళ్తాం. అప్పటికే కీళ్లు బలంగా మారతాయి, అలసట నుండి శరీరం త్వరగా కోలుకుంటుంది. అంటే శరీరానికి కొన్ని రోజుల సమయం కాకుండా, కొన్ని నెలల సమయం ఇవ్వడం వల్ల అది ఎక్కువ శ్రమను తట్టుకోగలుగుతుంది.
అందరూ మర్చిపోయే ముఖ్యమైన విషయం
ఫిట్‌నెస్ ప్రపంచంలో చాలా మంది దాచేసే ఒక నిజాన్ని అంజలి స్పష్టం చేశారు. "కేవలం కార్డియో చేయడం వల్లే బరువు తగ్గరు. క్యాలరీల లోటు (Calorie Deficit) వల్ల మాత్రమే బరువు తగ్గుతారు." కార్డియో అనేది ఖర్చు చేసే శక్తిని పెంచి, ఆ క్యాలరీల లోటును బ్యాలెన్స్ చేయడానికి సహాయపడే ఒక సాధనం (Tool) మాత్రమే, అదే పూర్తి పరిష్కారం కాదు అంటూ తన అనుభవాలను షేర్ చేశారు.
నోట్ : కార్డియోనే సర్వస్వం అనుకునేవారు బరువు తగ్గకపోగా త్వరగా అలసిపోయి నిరాశకు గురవుతారు. కానీ ఆహారం, నిద్ర, కోలుకునే సమయంతో పాటు కార్డియోను కూడా ఒక భాగంగా చూసేవారే ఆరు నెలల తర్వాత కూడా ఆరోగ్యంగా మనగలుగుతారు. 30 కిలోల బరువు అనేది ఒకే రాత్రిలో తగ్గింది కాదు; ఓపికగా, క్రమంగా, స్థిరమైన అడుగులతో సాధించిన విజయం అనేది గుర్తించాలి.


