అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం అన్ని రకాల వ్యాపారులపై ప్రభావం చూపనుంది. యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలు సగటు వ్యాపారిపై తెలియకుండానే పడే అదనపు ఆర్థిక భారం. ముఖ్యంగా మెడికల్ దుకాణాల్లో తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వ్యాపారులపై మరింత ప్రభావం చూపుతుంది. వినియోగదారులపై భారం పడకుండా, ప్రతి నెలా మా లాభాల్లోంచే ఈ ఖర్చును భరించాల్సి రావచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక భారం ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టమవుతుంది.
– దేవరశెట్టి రమేష్,
మెడికల్ షాపు నిర్వాహకుడు, మహబూబ్‌నగర్


