నగదు వద్దు.. డిజి టల్ ముద్దు అంటూ ప్ర జలను డిజిటల్ చెల్లింపుల వైపు ప్రోత్సహించిన కేంద్రం ఇప్పుడు యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించడం సరికాదు. గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు బదులు డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇలాంటి సమయంలో యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించడం ఏమిటి? బీమా రంగంతో పాటు ఇతర సేవల చెల్లింపులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలి.
– కె.కాశీనాథ్,
కోటకొండ, నారాయణపేట


