వీరులారా.. వందనం | - | Sakshi
Sakshi News home page

వీరులారా.. వందనం

Sep 17 2026 2:08 AM | Updated on Sep 17 2026 2:08 AM

మతమార్పిడుల వ్యతిరేకత నుంచి మొదలైన ఆర్యసమాజ్‌ చైతన్యం.. క్రమంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ప్రజా ఉద్యమంగా మారింది. యజ్ఞాల పేరుతో గ్రామగ్రామాన ప్రజలను ఏకం చేస్తూ యువతకు కత్తి, కర్రసాముల్లో శిక్షణనిస్తూ రహస్యంగా ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేశారు. అరెస్టులు, జైళ్లు, రజాకార్ల బెదిరింపులు ఎదురైనా ఉద్యమ జ్వాల ఆరలేదు. 1944లో నిజాం అనుమతిని ధిక్కరిస్తూ నారాయణపేటలో నిర్వహించిన భారీ ర్యాలీ.. అప్పటి ప్రజా తిరుగుబాటు చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలింది.

సుండికే నివాసం నుంచే పాలన..

రజాకార్లపై రగిలిన ఉద్యమ జ్వాల..

నిజాంలకు గుబులు పుట్టించిన పేట యువత

సుండికే వారి నివాసం నుంచే రాజాకార్ల పాలన

1944లో భారీ ర్యాలీతో సంచలనం

ఆర్యసమాజ్‌ అండగా ప్రజా చైతన్యం

మతమార్పిడిపై రగిలిన ఉద్యమ జ్వాల

–8లో u

నారాయణపేట: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు సాగించిన పోరులో 1947–49 కాలంలో ప్రధాన ఆయుధాలుగా కర్ర, కత్తిసాములతో ఉద్యమాల కొనసాగింపులో నారా యణపేట ఆర్య సమాజ్‌ కీలకపాత్ర పోషించింది. ఉమ్మడి పాలమూరులో ఎంతోమంది పోరాటయోధులను జైలుకు పంపించి ఉద్యమాన్ని అణచివేశారు. కాగా 1948 ముందు జిల్లాలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు కొనసాగాయి. ఉద్యమ నేతలను రజాకర్లు తుపాకులతో కాల్చి చంపడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ప్రజల్లో వచ్చిన చైతన్యంతో నిజాం పాలకులు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.

షోలాపూర్‌ ఆర్యసమాజ్‌ కేంద్రంగా..

ఆ సమయంలో ఆర్యసమాజ్‌ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు నిజాం పాలకులు అనుమతి నిచ్చే వారు కాదు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఆర్య సమాజ్‌ కేంద్రంగా చేసుకొని లోక కల్యాణం నిమి త్తం గ్రామాల్లో ప్రత్యేకంగా యజ్ఞాలు నిర్వహిస్తున్నట్లు నిజాం పాలకులను నమ్మించడంలో కొంతవరకు సఫలీకృతులయ్యారు. య జ్ఞాల పేరిట ప్రజలను ఒకచోటకు చేర్చి నిజాం పాలకులను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించారు.

నారాయణపేట ప్రాంతంలో దర్గా రోడ్‌లోని సుండికే వారి నివాసం నుంచే రజాకార్లు కొనసాగించినట్లు పెద్దలు చెబుతున్నారు. వారికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమించినా అక్కడికి తీసుకెళ్లి శిక్షించే వారని.. ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక నెలల తరబడి జైలులో ఉండి అనారోగ్యానికి గురయ్యారని వివరిస్తున్నారు.

అప్పట్లో ఖాసీం రజ్వీ అనే రజాకారు నారాయణపేట ప్రాంతంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని హిందూ మతమార్పిడి చేసేందుకు పూనుకోవడంతో ఉద్యమజ్వాల రగిలినట్లు పెద్దలు చెబుతున్నారు. మొదట్లో మతమార్పిడి కొంతమేర జరిగినా.. తర్వాతి కాలంలో ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆర్యసమాజ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున పోరాటం కొనసాగించారు. కాలక్రమేణా స్వాతంత్య్రం కోసం రజాకర్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమై పదునైన ఆయుధాలు లేకపోవడంతో యువతకు కత్తి, కర్రసాము, యుద్ధవిద్యపై ప్రత్యేకంగా శిక్షణనిచ్చి తీర్చిదిద్దారు.

1944లో నారాయణ పేట గడ్డపై నిజాం వ్యతిరేక ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు హైదరాబాద్‌కు చెందిన సూరజ్‌ చంద్రోజీ, పండిత్‌ నరేంద్రజీ, నారాయణపేటకు చెందిన రాంచందర్‌రావు కల్యాణి ఆధ్వర్యంలో సన్నాహాలు జరిగాయి. ర్యాలీ అనంతరం స్థానిక శాతవాహన కాలనీ ప్రాంతంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఉద్యమకారు లు ప్రతిపాదించారు. ర్యాలీ కి నిజాం పాలకులు అనుమతి ఇవ్వ లేదు. దీంతో తొలుత పరిమిత సంఖ్యలోనే ప్రజలు తరలివచ్చారు. అయితే నిషేధం ఉద్యమకారుల ఉత్సాహాన్ని తగ్గించలేదు. క్రమంగా పెద్ద సంఖ్యలో యువకులు ర్యాలీకి చేరుకున్నారు. చివరకు వేలాదిగా తరలివచ్చిన యువ త నిజాం వ్యతిరేక నినాదాలతో ర్యాలీని విజయవంతం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement