బాల్యానికి స్వేచ్ఛ..! | - | Sakshi
Sakshi News home page

బాల్యానికి స్వేచ్ఛ..!

Aug 3 2026 1:13 AM | Updated on Aug 3 2026 1:13 AM

జిల్లాలో ముగిసిన ఆపరేషన్‌ ముస్కాన్‌

‘చేతిలో పుస్తకం.. స్నేహితులతో ఆటలాడాల్సిన ప్రాయం.. కానీ పరిస్థితులు వారిని ఇటుక బట్టీలు, పొలాలు, హోటళ్లు, దుకాణాలు, వర్క్‌షాపుల వైపు అడుగులు వేస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి కూలీ పనులకు వెళ్తున్న వారు కొందరైతే.. కుటుంబానికి దూరమై అనాథలుగా, తప్పిపోయి భిక్షాటన చేస్తూ కనిపిస్తున్న వారు మరికొందరు. ఇలా బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులకు చదువు, ఆటలు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహించే ఆపరేషన్‌న్‌ స్మైల్‌,

ఆపరేషన్‌ ముస్కాన్‌న్‌ ఆశాకిరణంగా మారుతోంది.’

నారాయణపేట: చిన్నారుల భద్రతకు అధికారులు పెద్దపీట వేస్తున్నారు. కుటుంబాలకు దూరమైన పిల్లలను గుర్తించడం.. బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించడం.. అక్రమ రవాణా, దుర్వినియోగం బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా ఆపరేషనన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2019 నుంచి 2026 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో జిల్లావ్యాప్తంగా 1,274 మంది బాలకార్మికులను గుర్తించినట్లు పోలీసుశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

బడి దూరమై.. బతుకు పోరులోకి...

పేదరికం, కుటుంబ పరిస్థితులు, తల్లిదండ్రుల అవగాహన లోపం.. కారణం ఏదైనా నష్టపోతున్నది మాత్రం చిన్నారులే. చదువుకోవాల్సిన వయసులో కూలీ పనులు చేస్తూ విద్యకు దూరమవుతున్నారు. బాలకార్మికులుగా మారడంతో వారి భవిష్యత్‌పైనా ప్రభావం పడుతోంది. ఇలాంటి పిల్లలను గుర్తించి పనుల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా వారి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవడం, తల్లిదండ్రులను గుర్తించడం, అవసరమైన చోట సంరక్షణ కేంద్రాలకు తరలించడం, చదువుకు దూరమైన వారిని ఆర్బీసీ సెంటర్లు, పాఠశాలల్లో చేర్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను గుర్తిస్తే వారి కుటుంబాల చెంతకు చేర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఏడాది ఆపరేషన్‌ ఆపరేషన్‌ మొత్తం

స్మైల్‌ ముస్కాన్‌

2019 53 106 159

2020 75 – 75

2021 125 61 186

2022 57 166 223

2023 170 105 275

2024 64 38 102

2025 66 56 122

2026 71 61 132

ఏడాదిలో రెండుసార్లు..

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషనన్‌ స్మైల్‌, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కానన్‌్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఆపరేషనన్‌ స్మైల్‌ ద్వారా 71 మంది, ప్రస్తుతం ముగిసిన ఆపరేషన్‌ ముస్కానన్‌లో 61 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. మొత్తంగా 2026లో ఇప్పటి వరకు 132 మంది చిన్నారులను రక్షించారు. 2019 నుంచి 2026 వరకు మొత్తంగా 1,274 మంది చిన్నారులను గుర్తించి రక్షించారు. అత్యధికంగా 2023లో 275 మంది చిన్నారులకు విముక్తి లభించింది.

బాలల భద్రతే లక్ష్యంగా

చిన్నారులు బాలకార్మికులుగా మారకుండా, అక్రమ రవాణా లేదా ఇతర దుర్వినియోగాలకు గురికాకుండా ప్రత్యేక బృందాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తప్పిపోయిన పిల్లల ఆచూకీ గుర్తించడం, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం, కుటుంబాలకు దూరమైన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం వంటి చర్యలు చేపడుతున్నారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

బాలకార్మికులు, అనాథలు, భిక్షాటన చేస్తున్న బాలలకు విముక్తి

తల్లిదండ్రులకు అవగాహన.. చిన్నారులు తిరిగి పాఠశాలలకు...

జిల్లావ్యాప్తంగా 61 మంది గుర్తింపు

ఎనిమిదేళ్లలో 1,274 మంది బాలలు

ఏడాది వారీగా పట్టుబడిన చిన్నారులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement