ప్రారంభోత్సవం చేయాలి... | - | Sakshi
Sakshi News home page

ప్రారంభోత్సవం చేయాలి...

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

ప్రారంభోత్సవం చేయాలి... ఉన్నతాధికారులకు విన్నవిస్తాం..

గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పంచాయతీ భవనం నిర్మించి రెండేళ్లు గడిచినా ప్రారంభించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రంలోని అదనపు గదిలో పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి వెంటనే భవనాన్ని ప్రారంభించాలి.

– హన్మంతు,

ఏర్గాట్‌పల్లి, ఊట్కూర్‌

ఏర్గాట్‌పల్లిలో గ్రామపంచాయతీ భవనం నిర్మించిన కాంట్రాక్టర్‌కు నిధులు లేక బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తా.

– అజయ్‌కుమార్‌రెడ్డి, ఏఈ

Advertisement
 
Advertisement
Advertisement