ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం
పండుగ రద్దీతో రీజియన్‌కు మెరుగైన రాబడి
స్టేషన్ మహబూబ్‌నగర్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక అదనపు బస్సు సర్వీసులను నడిపింది. మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్ నుంచి పది డిపోలకు 430 బస్సులు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఆయా డిపోల నుంచి హైదరాబాద్ వైపు 364 బస్సులు నడిపారు. ముఖ్యంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లడానికి అధికంగా బస్సులు తిప్పారు. వీటిలో సెలవులు ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.
అత్యధికంగా 109 శాతం..
మహాలక్ష్మి పథకం కింద ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణంలో జీరో టికెట్ ఉన్నప్పటికీ అందులో వారు తిరిగిన రూట్ ఆధారంగా టికెట్ చార్జీ కూడా పొందుపరిచారు. సాధారణ, మహిళల ఆదాయాన్ని కలుపుకొని సంక్రాంతి పండుగ రోజులకు సంబంధించి ఈ నెల 9 నుంచి 20 వరకు (14, 15, 16 తేదీలు మినహా) మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో అదనపు బస్సు సర్వీసులు నడపగా రూ.22,69,54,338 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నుంచి 20 వరకు రీజియన్‌లోని బస్సులు 34,47,623 కిలోమీటర్లు తిరిగాయి. మహాలక్ష్మి పథకం ప్యాసింజర్లు, టికెట్ చార్జీ ప్రయాణికులతో కలిపి 39,20,918 మంది బస్సుల్లో ప్రయాణించారు. ఆక్యుపెన్షి రేషియాలో మహబూబ్‌నగర్ రీజియన్ రాష్ట్రంలో అత్యధికంగా 109 శాతం సాధించి అగ్రస్థానంలో నిలవడం విశేషం.
డిపో కిలోమీటర్లు ఆదాయం ప్రయాణికులు
మహబూబ్‌నగర్ 5,40,780 3,38,01,857 5,14,321
వనపర్తి 4,57,678 3,09,42,056 5,33,909
గద్వాల 4,06,181 2,46,20,151 4,95,360
అచ్చంపేట 3,34,898 2,44,05,169 3,39,395
కల్వకుర్తి 3,65,956 2,38,98,638 4,23,531
నారాయణపేట 3,66,405 2,37,08,913 3,66,638
షాద్‌నగర్ 3,18,770 2,24,55,052 4,09,820
నాగర్‌కర్నూల్ 3,17,478 2,09,87,807 4,39,589
కొల్లాపూర్ 2,71,300 1,81,41,848 3,05,620
కోస్గి 68,177 39,92,947 92,735
ఈ నెల 9 నుంచి 20 వరకు
రూ.22 కోట్లు ఆర్జన
34 లక్షల కి.మీ. ప్రయాణం,
39 లక్షల ప్రయాణికుల వినియోగం
ఓఆర్‌లో రాష్ట్రంలోనే
మహబూబ్‌నగర్ రీజియన్ అగ్రస్థానం
ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం


