ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం అండర్–14 విభాగం బాల, బాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. విద్యార్థులకు 100 మీ., 200 మీ., 400 మీ., 600 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో ఎంపికలు జరిగా యి. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ పంపడం జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం అండర్–17 విభాగం బాల, బాలికల అథ్లెటిక్స్ ఎంపికలు జరగనున్నాయి. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, జగన్‌మోహన్‌గౌడ్, ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


