బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
నారాయణపేట: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్, ఫంక్షన్‌హల్స్, సౌండ్ సిస్టం యజమానులు, వంట మాస్టర్లతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. బాల్యవివాహ రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలని కోరారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, ఐసీడీఎస్ అధికారులు శ్రీలత, నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ అధికారి కరిష్మ, అనిత, తిరుపతయ్య పాల్గొన్నారు.


