కాంక్రీట్ లైనింగ్ నిర్మించాలి..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన కాల్వలకు ఇప్పటివరకు కాంక్రీట్ లైనింగ్ చేయలేదు. దీంతో నీటి ప్రవాహం ధాటికి మట్టి కొట్టుకుపోయి కాల్వలు తెగుతున్నాయి. డీ–29 పరిధిలో తరచుగా కాల్వలు తెగి రైతుల పొలాలు మునుగుతున్నాయి. తిమ్మరాసిపల్లి, కురిమిద్ద, వెంకటాపూర్ గ్రామాల వద్ద కాల్వ తెగి తీవ్రంగా నష్టపోతున్నాం.
– పసుల గోవర్ధన్‌రెడ్డి, రైతు, కల్వకుర్తి
కాల్వల పటిష్టానికి చర్యలు..
కేఎల్‌ఐ కింద కాల్వల నిర్వహణకు చర్యలు తీసుకుంటాం. కాల్వలకు గండి పడితే వెంటనే స్పందించి కట్టడి చేస్తున్నాం. అవసరమైన చోట్ల మరమ్మతులు చేస్తున్నాం. విడతల వారీగా కాల్వల పటిష్టానికి చర్యలు చేపడతాం.
– విజయ్‌భాస్కర్‌రెడ్డి, సీఈ, నీటిపారుదల శాఖ
●


