
కష్టపడిన కార్యకర్తలకే పదవులు
● ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి
మక్తల్/నర్వ: కాంగ్రెస్‌లో కష్టపడిన కార్యకర్తలకే పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి అన్నారు. మంగళవారం పట్టణంలోని మంత్రి వాకిటి శ్రీహరి నివాసంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో మక్తల్, మాగనూర్, కృష్ణా మండలాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. సంఘటన సృజన్ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాల తెలుసుకొని, వారి అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసి నివేదికను 22న ఏఐసీసీకి అందజేస్తామన్నారు. జిల్లాలోని మూడు రోజుల పాటు పర్యటించి కార్యకర్తలను అభిప్రాయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. డీసీసీ ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో ప్రజల సమస్యలను లోతు గా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నిర్ణయాత్మక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, సిదార్థరెడ్డి, పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ గణే ష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.