
మద్దూరులో ఆసక్తికర ఘటన
మద్దూరు: బీసీ బంద్ నేపథ్యంలో మద్దూరులో శనివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొదట కాంగ్రెస్, వామపక్ష నాయకులు కలిసి పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కొద్ది సేపటికి బీఆర్‌ఎస్ నాయకులు నివాదాలు చేస్తూ ఇదే పాతబస్టాండ్ చేరుకొని మరోవైపు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో బీజేపీ నాయకులు ధర్నాకు కూర్చున్నారు. ఈ మూడు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దిలేద ని బీఆర్‌ఎస్, బీజేపీలు ఆరోపించగా, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రిజర్వేషన్ల అమలను అడ్డుకుంటుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఒకానొక సయ మంలో మూడు పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో నినాదాలు చేయడంలో పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను త్వరగా విరమించాలని సూచించారు. మొదట కాంగ్రెస్, వామపక్ష నాయకులు మాట్లాడి ధర్నా విరమించగా, తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు దర్నాలను విరమించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ధర్నాలో.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేసినా ధర్నాలో తమ పార్టీల స్వలాభం కోసం మాత్రమే వచ్చాయని అక్కడి వచ్చిన వారు మాట్లాడుకోవడం విశేషం. కార్యక్రమంలో 4 పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.