
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి
స్టేషన్ మహబూబ్‌నగర్: నారాయణపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా తీసుకున్నామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి శనివారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ అర్బన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందని, ఎవరూ ఎలాంటి అపోహలు లేకుండా అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ చేపట్టిందన్నారు. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ముందున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎవరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో, ఎవరు డీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందో గ్రహించి వారి పేరును ఏఐసీసీ పరిశీలకులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఏఐసీసీ పరిశీలకులు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధులు హర్షవర్ధన్‌రెడ్డి, జహీర్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.