
స్వేచ్ఛను హరిండచం తగదు
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికలపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్భందించడం, జర్నలిస్టుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తూ భయాభ్రాంతులకు గురిచేయడం తగదు. అనుకూలమైన వార్తలు రాయాలంటూ బెదిరించడం, మీడియాను తొక్కిపెట్టాలని ప్రయత్నాలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
– అవుటి రాజశేఖర్, టెంజు, జిల్లా అధ్యక్షుడు
కక్ష పూరిత విధానాలు సరికాదు
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోంది. కక్షపూరితమైన విధానాలు కొనసాగిస్తోంది. తన తప్పులను వెలికితీసేందుకు ప్రయత్నించే వారిని అక్రమంగా నిర్బంధిస్తోంది. పత్రికా విలేకర్లపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేయడం.. దాడి చేయడం అమానూషం. భావప్రకటన స్వేచ్ఛకు సంకేళ్లు వేయడం సమాంజసం కాదు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చను అడ్డుకోరాదు.
– లొట్టి శ్రీను, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు
●

స్వేచ్ఛను హరిండచం తగదు