
అక్రమ కేసులతో గొంతునొక్కే కుట్ర
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వంవేధింపులు మానుకోవాలి
● జిల్లాలో జర్నలిస్టుసంఘాల డిమాండ్
నారాయణపేట: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి గొంతునొక్కే కుట్ర చేస్తుందని.. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని పాత్రికేయలోకం డిమాండ్ చేసింది. ఇటీవల కాలంలో ఏపీ కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులతోపాటు వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో పలువురు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సంస్థ కార్యాలయాల్లోకి చొరబడి నిర్బంధ విచారణ సాగించడం, తరచూ నోటీసులు జారీ చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.