
బీసీ బంద్ ప్రశాంతం
నారాయణపేట: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్ నారాయపేట జిల్లాలో సంపూర్ణమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల నాయకులు వేర్వేరుగా బంద్ చేయించారు. నారాయణపేట ఆర్టీసీ డిపో దగ్గరకు తెల్లవారుజామున అఖిలపక్షం నాయకులు చేరుకొని బస్సులు బయటికి రాకుండా గేట్ దగ్గర ధర్నా చేపట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. పట్టణంలో విద్యా వ్యాపార వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. మక్తల్, కోస్గి, నర్వ, మరికల్, ధన్వాడ, ఊట్కూర్‌తోపాటు ఇతర మండలాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల జేఏసీ నాయకులు బంద్‌లో భాగస్వాములు అయ్యారు.
● జిల్లా కేంద్రంలో మార్కెట్ చైర్మన్ రాంపురం శివారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బంద్‌ను సంపూర్ణంగా చేపట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్ట బద్దంగా చేసిన సవరణలను చూసి తెలంగాణకు బీసీ రిజర్వేషన్ ఇచ్చేలా కృషి చేయాలని ప్రధానిని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.
● బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేంచె శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ కులగలన సరిగా చేయకుండా బీసీలలో ముస్లింలను కలిపి పూర్తి తప్పులతో ఎలాంటి చిత్త శుద్ధి లేకుండా అడ్డగోలుగా బిల్లును తయారు చేసి గవర్నర్ కి పంపిందని విమర్శించారు. దాంతో న్యాయ స్థానాలతో చివాట్లు తింటూ.బీసీలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు.
ఆర్టీసీ డిపో వద్ద అఖిలపక్షపార్టీల ఆధ్వర్యంలో ఆందోళన
ఎక్కడిబస్సులు అక్కడే నిలిచిన వైనం.. ప్రయాణికుల ఇబ్బందులు
విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద బంద్

బీసీ బంద్ ప్రశాంతం

బీసీ బంద్ ప్రశాంతం

బీసీ బంద్ ప్రశాంతం